న్యూజిలాండ్ లో సద్దుమణిగిన కరోనా... వైరస్ పై విజయం!
- వారం రోజులుగా ఒక్క కేసూ లేని వైనం
- 1504 మందికి కరోనా
- ప్రస్తుతం ఒకే ఒక్క యాక్టివ్ కేసు
అయితే, కఠినమైన లాక్ డౌన్ ఆంక్షల వల్లే ఇది సాధ్యమైంది. కానీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత వారం రోజులుగా న్యూజిలాండ్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ తొలగించిన తర్వాత కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం న్యూజిలాండ్ సామర్థ్యానికి పరీక్ష కానుంది.