హైదరాబాద్ సహా 13 నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు.. మిగతా చోట్ల ఎత్తివేత?
- కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు
- జూన్ 1 నుంచి తెరుచుకోనున్న మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు?
- ‘మన్ కీ బాత్’లో రేపు వెల్లడించనున్న ప్రధాని
లాక్‌డౌన్ కొనసాగించే నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణె, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్‌పట్టు, తిరువల్లూరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగరాల్లో మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశలున్నాయని చెబుతున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అది దశలవారీగానే ఉంటుందని సమాచారం. రేపు ప్రధాని ‘మన్ కీ బాత్’లో లాక్‌డౌన్ 5.0కి సంబంధించిన విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.