వివాదాస్పదమైన 'కెంట్' యాడ్... స్పందించిన హేమమాలిని!
- ఇటీవల డవ్ మేకర్ ను విడుదల చేసిన కెంట్
- పనిమనుషులను కించపరిచేలా వ్యాఖ్యలు
- విమర్శలు రావడంతో క్షమాపణలు
ఈ ప్రకటన టీవీల్లో రాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వెంటనే ప్రకటనను నిలిపివేసిన కెంట్, బహిరంగ క్షమాపణ చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. తాము కావాలని ఈ యాడ్ ను తయారు చేయలేదని, అయినప్పటికీ తప్పు జరిగిందని అంగీకరిస్తున్నామని, ప్రజలు తమను మన్నించాలని కోరింది.
మరోపక్క, అసలు ఇటువంటి వ్యాపార ప్రకటనలు చేయడం ఎందుకంటూ హేమమాలినిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆమె స్పందిస్తూ, "ఇటీవలి కెంట్ ఆర్వో సిస్టమ్స్ అడ్వర్ టయిజ్ మెంట్ లో వెలిబుచ్చిన అంశాలు నాలోని విలువలనేమీ ప్రతిధ్వనించదు. అందులోని డైలాగులు సరికాదు. ఇప్పటికే సంస్థ చైర్మన్ తప్పు జరిగిందని అంగీకరించి, బహిరంగ క్షమాపణలు చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ నేను గౌరవిస్తాను" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.