తెలంగాణలో కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 107 కేసులు.. ఆరుగురి మృతి
- 2,098కి పెరిగిన కేసులు.. 63కి పెరిగిన మరణాలు
- విదేశాల నుంచి వచ్చిన 49 మందికి కరోనా
- కరోనా బారినపడిన 19 మంది వలస కూలీలు
మరోవైపు, సౌదీ అరేబియా నుంచి ఇటీవల రెండు విమానాల్లో 458 మంది హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని మిలటరీ ఆసుపత్రుల్లో వీరిని క్వారంటైన్‌లో ఉంచి ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో 94 మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. నిన్న ఒక్క రోజే 49 మందికి కరోనా సోకినట్టు తేలింది. లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్రానికి చేరుకుంటున్న వలస కూలీల్లో ఎక్కువమంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 173 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా, నిన్న ఒక్క రోజే 19 మంది కరోనా బారినపడ్డారు.