ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 1500 గుడిసెలు దగ్ధం
- అర్ధ రాత్రి దాటాక చెలరేగిన మంటలు
- రెండు ఎకరాల్లో ఉన్న పూరిగుడిసెలు అగ్నికి ఆహుతి
- రోడ్డున పడ్డ వందలాదిమంది
రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 2 ఎకరాల్లో ఉన్న 1500 పూరిగుడిసెలు కాలి బూడిదైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.