హైదరాబాదులో పీహెచ్ డీ విద్యార్థి అనుమానాస్పద మృతి
- ఉరేసుకున్న స్థితిలో కనిపించిన యువకుడు
- ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
- సంఘటన స్థలంలో కనిపించని సూసైడ్ నోట్
సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని, ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్ ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.