తన కూతురుతో కలసి వున్న ఫొటోను పోస్ట్ చేసిన సినీ నటి సంఘవి!
- 39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సంఘవి
- పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వైనం
- 42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన కన్నడ భామ
లేటుగా పెళ్లి చేసుకున్న సంఘవి 42 ఏళ్ల వయసులో ఇటీవల తల్లి అయింది. తాజాగా తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా కాలం తర్వాత సంఘవి కనిపించడం, పైగా తన కూతురుని కూడా చూపించడంతో... ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.