పెళ్లి చేసుకుంటే దూరమైపోతామని.. యువతుల ఆత్మహత్య!

Two girls suicide in Tamil Nadu
  • తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఘటన
  • విడిచి ఉండలేమని భావించి తీవ్ర నిర్ణయం
  • ఒకే చీరకు ఉరివేసుకుని ఆత్మహత్య
పెళ్లి చేసుకుంటే ఎక్కడ దూరమైపోతామోనన్న భయంతో ఇద్దరు స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా ఎలచ్చిపాళయంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఎలయంపాళయానికి చెందిన జ్యోతి (23)కి నందకుమార్‌తో వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉండగా, భర్త నుంచి విడిపోయి పెరియమణలిలో నివసించే తల్లిదండ్రులతో కలిసి ఉంటూ నేతపట్రలో పనిచేస్తోంది. కోట్టపాళయానికి చెందిన ప్రియ (20) కూడా అక్కడే పనిచేస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో ఈ నెల 27న ప్రియకు వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే, వివాహం జరిగితే జ్యోతి నుంచి విడిపోవాల్సి వస్తుందని ప్రియ ఆందోళన చెందింది. శనివారం జ్యోతి ఇంటికి వచ్చిన ప్రియ.. విషయం చెప్పింది.

విడిపోవడం కంటే కలిసి చనిపోవడం మంచిదని భావించిన ఇద్దరూ ఒకే చీరకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియ ఎంత సేపటికీ ఇంటికీ రాకపోవడంతో ఆమె తల్లి శ్వేత.. జ్యోతి ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. స్థానికుల సాయంతో పగలగొట్టి చూడగా ఇద్దరూ సీలింగుకి వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. శ్వేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tamil Nadu
Girls
Suicide

More Telugu News