తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం.. పుచ్చకాయల మాటున తరలింపు!
- గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్టు వద్ద పట్టుబడిన మద్యం
- మూడు వాహనాల్లో 2630 సీసాల అక్రమ రవాణా
- ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పుచ్చకాయల మాటున మూడు వాహనాల్లో వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 5 లక్షలు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.