చట్టానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గుత్తా సుఖేందర్
- 203 జీవోతో కృష్ణా ఆయకట్టు ఎడారిగా మారుతుంది
- కేసీఆర్ ఉన్నంత వరకు ఒక్క చుక్కను కూడా అక్రమంగా తరలించలేరు
- పోతిరెడ్డిపాడును ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలపై ఉంది
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ప్రస్తుత నల్గొండ, భువనగిరి ఎంపీలు (కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి) గతంలో సమర్థించారని... ఈ విషయాన్ని ఇప్పుడు వారు గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించుకోవాలని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు గతంలో నీరు వెళ్లినప్పుడు ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణ హారతులు పట్టారని విమర్శించారు.
ఉమ్మడి ఏపీకి రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని గుత్తా అన్నారు. పోతిరెడ్డిపాడును ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.