తొలి సినిమా చూసుకోకుండానే కన్నుమూసిన యువ దర్శకుడు... కోలీవుడ్ లో విషాదం
- కోయంబత్తూరులో రోడ్డుప్రమాదం
- దర్శకుడు అరుణ్ ప్రశాంత్ దుర్మరణం
- దిగ్భ్రాంతికి గురైన '4జీ' చిత్రబృందం
శంకర్ వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న ప్రశాంత్ 2016లో తన తొలి సినిమా 4జీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాదులో ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఆపై అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైన తరుణంలో దర్శకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం చిత్ర బృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై హీరో జీవీ ప్రకాశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. స్నేహితుడు, సోదరుడి వంటి వ్యక్తి ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపాడు.