కన్న కొడుకును కిరాతకంగా హత్య చేసిన టర్కీ ఫుట్ బాల్ స్టార్ కెవెర్ టోక్టాస్!
- కరోనా లక్షణాలతో కుమారుడితో సహా ఆసుపత్రిలో చేరిన టోక్టాస్
- ఆపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
- 11 రోజుల తరువాత పశ్చాత్తాపంతో లొంగిపోయిన వైనం
వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ రావడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరినీ ఐసోలేషన్ లో ఉంచారు. ఆపై ఈ నెల 4న అతని గదిలోకి వెళ్లిన టోక్టాస్, కుమారుడి ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆపై ఏమీ ఎరుగనట్టు ఉండిపోయాడు. బాలుడి పరిస్థితి విషమించిందని గమనించిన వైద్యులు ఐసీయూకు తరలించినా, ఫలితం దక్కలేదు. ఖాసిమ్ కరోనాతో మరణించాడని ప్రపంచాన్ని నమ్మించిన టోక్టాస్, అంత్యక్రియలు కూడా చేశాడు.
ఆపై 11 రోజుల తరువాత పోలీసుల ముందుకు వచ్చి, తాను చేసిన దుర్మార్గం గురించి చెప్పాడు. కొడుకంటే తనకు ఇష్టం లేదని, అందుకే చంపేశానని, తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని చెప్పాడు. ఆపై టోక్టాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును విచారిస్తున్నారు.