కోనసీమలో దడ పుట్టిస్తున్న 'కోయంబేడు' లింక్!
- కోనసీమలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు
- నలుగురు కోయంబేడు మార్కెట్ కు వెళ్ళొచ్చిన వైనం
- భర్త నుంచి భార్యకు సోకిన కేసు మరొకటి
మరోవైపు కొత్తపేట మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏనుగుల మహల్ కు చెందిన ఇద్దరికి, బోడిపాలెంకు చెందిన మరొక వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. ఈ ముగ్గురు ఈ నెల 10న కోయంబేడు నుంచి రావులపాలెం చేరుకున్నారు. అయితే కరోనా అనుమానం రావడంతో ఇళ్లకు వెళ్లకుండా... కొత్తపేట సమీపంలో ఉన్న ఓ లంకలో తలదాచుకుని, అధికారులకు సమాచారాన్ని అందించారు. అధికారులు వీరికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.