మోదీ ప్యాకేజీకి 'ఆత్మ నిర్భర్ భారత్' అనే పేరు ఎందుకు పెట్టారంటే.. : నిర్మలా సీతారామన్
- దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను మోదీ ఉంచారు
- స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ప్యాకేజీ లక్ష్యం
- ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం అని అర్థం
ఐదు మూల సూత్రాల ఆధారంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్రకటనను మోదీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు... ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ అని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే... స్వయం ఆధారిత భారతం అని అర్థమని తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్ కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈరోజు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) లకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.