దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో మరో 3,525 మందికి సోకిన వైనం
- గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 2,415
- మొత్తం కేసులు 74,281
- కోలుకున్న 24,386 మంది
ఇక గత 24 గంటల్లో దేశంలో 3,525 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 74,281కి చేరింది. అలాగే, కరోనా నుంచి 24,386 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 47,480 మంది చికిత్స పొందుతున్నారు.