సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పెళ్లికి రెడీ అవుతున్న నయనతార
- మరో రికార్డు కొట్టిన బన్నీ పాట
- వాయిదా పడిన సూపర్ స్టార్ సినిమా
* అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం మ్యూజికల్ గా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఇందులోని ప్రతి పాటా సూపర్ హిట్టయింది. ఈ క్రమంలో ఇందులోని 'రాములో రాములా' పాట యూ ట్యూబ్ లో 100 మిలియన్ (10 కోట్లు) వ్యూస్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును కొట్టింది.
* లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం విడుదల వాయిదా పడింది. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇక సంక్రాంతికి వాయిదా వేసుకున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.