రాజకీయరంగంలోకి వస్తున్న సినీ దర్శకనిర్మాత

  • రాజకీయాల్లోకి వస్తానన్న మధుర శ్రీధర్
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
  • బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు
తెలుగు సినీ పరిశ్రమలో మధుర శ్రీధర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాదు, మధుర ఆడియో కంపెనీ ద్వారా సినిమా పాటలను విడుదల చేస్తుంటారు. సినీ రంగంలో బిజీగా ఉన్న మధుర శ్రీధర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2024 ఎన్నికలకు ముందే రాజకీయ అరంగేట్రం చేస్తానని... ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

Madhura Sridhar
Tollywood
Politics

More Telugu News