Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిబ్బందిలో ఒకరికి కరోనా... ఎయిరిండియా ప్రధాన కార్యాలయం మూసివేత

Air India employ tested corona positive
  • గురువారం ఆఫీసుకు హాజరైన ఉద్యోగి
  • సోమవారం నాడు కరోనా అని నిర్ధారణ
  • ప్రస్తుతం ఆఫీసులో శానిటైజేషన్ ప్రక్రియ
ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఎయిరిండియా ఆఫీసును రెండ్రోజుల పాటు మూసివేశారు. మంగళవారం ఉదయం ఆఫీసుకు తాళం వేశారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తి గత గురువారం బుద్ధ పూర్ణిమ నాడు ఆఫీసుకు హాజరైనట్టు గుర్తించారు. సోమవారం నాడు కరోనా అని తేలడంతో ఆఫీసులో కూడా ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు ఉండొచ్చని భావించి సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆఫీసు లోపలి భాగం, ఆవరణను శుద్ధి చేస్తున్నారు. కాగా, కరోనా సోకిన ఆ ఉద్యోగికి సంస్థ నుంచి అన్ని విధాలుగా సాయం అందుతుందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
Air India
Head Quarters
Employ
Corona Virus
Positive

More Telugu News