నాడు ‘ఎల్జీ పాలిమర్స్’ విస్తరణకు అనుమతులిచ్చింది చంద్రబాబే : వైసీపీ నేత ఇక్బాల్

YSRCP Leader Iqbal criticises TDP
షార్ట్స్‌లో చూడండి
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో ఉన్న తరుణంలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు, టీడీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు అనమతులు ఇచ్చింది చంద్రబాబేనని విమర్శించారు. ఈ పరిశ్రమపై చిన్న కేసులు పెట్టారంటూ బాబు విమర్శలు చేయడం తగదని, ఈ ఘటనకు సంబంధించిన కమిటీ నివేదికలు రాగానే ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం బాబుకు తెలియందేమీ కాదని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కమిటీ సమస్యలు సృష్టించి, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు.
Go Back to Shorts
Iqbal
YSRCP
Chandrababu
Telugudesam
Vizag Gas Leak

More Telugu News