మద్యం అమ్ముకుంటామంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన తమిళనాడు ప్రభుత్వం
- షాపుల్లో మద్యం అమ్మకాలపై మద్రాస్ హైకోర్టు నిషేధం
- కావాలంటే ఆన్ లైన్లో అమ్ముకోవచ్చని సూచన
- హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన తమిళనాడు
ఈ నేపథ్యంలో, షాపుల ద్వారా మద్యం అమ్మకాలను ఆపేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కావాలంటే... ఆన్ లైన్ ద్వారా మద్యాన్ని విక్రయించుకోవచ్చని సూచించింది. దీంతో, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం అమ్మకాలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.