మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం... 15 మంది వలస కార్మికుల మృతి
- ఈ తెల్లవారుజామున ప్రమాదం
- రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు
- దూసుకెళ్లిన ఖాళీ గూడ్స్ రైలు
"కర్మాడ్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది" అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.