గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ పాలిమర్స్ స్పందన
- గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది
- ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం
- ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం
గ్యాస్ ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్జీ చెప్పింది. గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపింది. ప్రజలు, ఉద్యోగులను రక్షించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పింది. లీక్ అయిన వాయువును పీల్చినప్పుడు వికారంతో పాటు, మైకం ఆవరిస్తుందని తెలిపింది. ప్రమాదం జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పింది.