హను రాఘవపూడికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్!

  • మలయాళంలో దుల్కర్ కి విపరీతమైన క్రేజ్
  •  నేరుగా తెలుగులో సినిమాకి సన్నాహాలు
  •  లాక్ డౌన్ తరువాత రెగ్యులర్ షూటింగ్
మలయాళంలో స్టార్  హీరోగా దుల్కర్ సల్మాన్ దూసుకుపోతున్నాడు. అక్కడ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.  'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన, నేరుగా తెలుగులో ఒక సినిమా చేయడానికి అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. హను రాఘవపూడికి .. దుల్కర్ కి మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. ఇటీవలే హను రాఘవపూడి ఆయనకి కథను వినిపించగా , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. 'మహానటి' సినిమాను నిర్మించిన 'స్వప్న సినిమా' వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.  కథానాయికతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తారు. తెలుగుతో పాటు  తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Hanu Raghvapudi
Dulquer Salman

More Telugu News