గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులను పరామర్శించిన సీఎం జగన్

CM Jagan visits Vizag KGH Hospital
  • విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేజీహెచ్ కు వెళ్లిన సీఎం
  • బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగన్
  • ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. వైద్య సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో జగన్ మాస్క్ ధరించారు. జగన్ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఉన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Vizag
KGH
Vizag Gas Leak

More Telugu News