గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి: కన్నా

Kanna demands twenty five lakhs ex gratia for Vizag gas leak victims
  • విశాఖలో విషవాయువు లీక్
  • ఎనిమిది మంది మృతి, వందల మంది ఆసుపత్రుల పాలు
  • మూగజీవాలు సైతం పెద్ద సంఖ్యలో మృత్యువాత
  • మూగజీవాల యజమానులకు కూడా పరిహారం చెల్లించాలన్న కన్నా
విశాఖపట్నంలో జరిగిన విషవాయువు లీక్ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. విషవాయు ప్రభావంతో కళ్లు కనిపించక ఓ వ్యక్తి బావిలో పడి మరణించడం అత్యంత దయనీయం. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఈ ప్రమాదంలో మూగజీవాలు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పట్ల లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. మృత్యువాతపడ్డ మూగజీవాల యజమానులకు నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.
Go Back to Shorts
Kanna Lakshminarayana
Vizag Gas Leak
Vizag
Ex Gratia

More Telugu News