గత ఐదు రోజుల్లో 80 వేల మందిని స్వస్థలాలకు తరలించిన రైల్వే
- గమ్యస్థానానికి చేరుకున్న 55 రైళ్లు
- నిన్న వివిధ నగరాల నుంచి బయలుదేరిన మరో 30 రైళ్లు
- ప్రయాణికుల కోసం రైళ్లలో అన్ని ఏర్పాట్లూ చేశామన్న రైల్వే
ఒక్కో రైలులో కనీసం వెయ్యిమంది ప్రయాణికులు ఉన్నట్టు వివరించింది. ఆయా రాష్ట్రాల డిమాండ్ మేరకే శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్న రైల్వే మరో 500 రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు రైల్వే స్పష్టం చేసింది.