తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభం
- ఆదిలాబాద్ సరిహద్దు మీదుగా తెలంగాణలోకి వాహనాలు
- జైనథ్ మండలం డొలారా వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు
- వాహనాలను, వ్యక్తులను తనిఖీలు చేస్తున్న అధికారులు
సొంత రాష్ట్రంలోకి వచ్చే తెలంగాణ వాసులకు 14 రోజుల హోం క్వారంటైన్ స్టాంప్ వేసి పంపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి పాసులు జారీ చేస్తున్నారు. కాగా, జైనథ్ మండలం డొలారా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ ను కలెక్టర్ శ్రీదేవసేన సందర్శించి.. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.