'పులుసు' ఆట ఆడిన రకుల్ ప్రీత్ సింగ్... వైరల్ వీడియో ఇదిగో!

Rakul Childhood Games in Lockdown
లాక్ ‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంది. తాజాగా, తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన ఆటలను ఆడుకుంటూ, అందుకు సంబంధించిన వీడియో తీసి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

తాను చేసిన యోగా వీడియోలను, సరదాగా చేసిన వీడియోలను ఇప్పటికే పోస్ట్ చేసిన రకుల్, తాజాగా, పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియోను పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. అమన్ తో కలిసి 'దిండూ - దెబ్బ', 'కబడ్డీ', 'పులుసు' ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నానని, ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకున్నానని, ఇటువంటి సమయం ఎవరినైనా బాల్యంలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించింది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 
Go Back to Shorts
Rakul Preet Singh
Games
Childhoot
Aman

More Telugu News