తెలంగాణ వాహనాలను అడ్డుకున్న ఏపీ, ఏపీ వాహనాలను అడ్డుకున్న తెలంగాణ... రోడ్లపై వేలాది మంది!
- స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
- సమన్వయ లోపంతో అడ్డుకున్న తెలుగు రాష్ట్రాల అధికారులు
- సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా కర్నూలు, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో చిక్కుకుని పోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి బయలుదేరిన వారంతా, ఈ ఉదయం వరకూ సరిహద్దుల వద్దే ఉండిపోయారు. దీంతో సరిహద్దుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకుని, తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు డిమాండ్ చేశారు.