ఇదెక్కడి విడ్డూరం... వింత కలిగిస్తున్న పిల్లి, పాము స్నేహం

Viral Pics of Cat and Snake Priendship
  • రికీ అనే నల్ల పిల్లిని పెంచుకుంటున్న డిచ్ సోనీ
  • పాము కనిపించడంతో దానితో స్నేహం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
పాము - ముంగీస, పిల్లి - కుక్క, ఎలుక - పిల్లి... ఇలా కొన్ని జాతుల జంతువుల మధ్య వైరం ఉండటం అందరికీ తెలిసిందే. కానీ ఒక్కోసారి పొంతనే ఉండని జంతువుల మధ్య స్నేహం ఉంటుందనడానికి ఈ చిత్రాలు ఓ ఉదాహరణ. నెటిజన్లు వింతగా చూస్తున్న దృశ్యాలివి. ఓ పిల్లి, పాముతో స్నేహం చేసింది.

డిచ్ సోనీ అనే మహిళ రికీ అనే పేరున్న నల్ల పిల్లిని పెంచుకుంటూ ఉండగా, దానికి ఓ నల్లటి పాము కనిపించింది. పాముతో, పిల్లి సహజ స్వభావానికి విరుద్ధంగా స్నేహం ప్రారంభించింది. కొన్ని రోజులుగా పిల్లి, పాము స్నేహాన్ని చూసిన డిచ్ సోనీ, వాటిని ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టగా, అవి వైరల్ అయ్యాయి.

తన పిల్లి ఎప్పుడూ పాముతో ఆడుకుంటోందని, ఏ జీవి, మరో జీవికి హాని చేయడం లేదని వ్యాఖ్యానిస్తూ, చూసేందుకు ఇవి సన్ బాత్ చేస్తున్నట్టుగా ఉందని కామెంట్ పెట్టింది. ఇక ఈ 'పిల్లి, పాముల వింత స్నేహం' ట్వీట్ లక్షకు పైగా రీ ట్వీట్లను తెచ్చుకుంది.
Go Back to Shorts
Cat
Snake
Friend Ship
Viral Pics

More Telugu News