శ్రీవారి ఆలయంలో ప్రవేశంపై నారా లోకేశ్ కు బదులిచ్చిన వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy replies to Nara Lokesh tweet
  • శ్రీవారి ఆలయంలో పుట్టినరోజు వేడుకలా అంటూ లోకేశ్ ట్వీట్
  • నీ ట్వీట్ అబద్ధం అంటూ వైవీ రిప్లయ్
  • తప్పు తెలుసుకో అంటూ హితవు
లాక్ డౌన్ కారణంగా మూతపడిన శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

"నారా లోకేశ్... ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఓసారి టీటీడీ చైర్మన్ హాజరవడం ఆనవాయితీ. నేను కూడా ఆ హోదాలోనే వెళ్లాను. ఆ ఫొటోలో నా తల్లిగారు, నా అర్ధాంగి, టీటీడీ ఉద్యోగులు తప్ప నా బంధువులెవరూ లేరు. నీ ట్వీట్ అబద్ధం. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. కొంచెమైనా పాప భీతి ఉండాలి" అంటూ హితవు పలికారు.
Go Back to Shorts
YV Subba Reddy
Nara Lokesh
Tirumala
TTD
Lockdown
Andhra Pradesh

More Telugu News