బరువు తగ్గించే వెయిట్ లాస్ సూప్ చేసిన కేఏ పాల్
- ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్
- తన భార్య కోసం సూప్ చేశానన్న పాల్
- ఒడిశాలో ఉన్నప్పుడు వంట చేసేవాడినని చెప్పిన పాల్
కొంచెం అనారోగ్యంతో ఉన్న తన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని... భగవంతుని దయ వల్ల ఆమెకు కరోనా సోకలేదని పాల్ తెలిపారు. తాను నార్వేలో ఉన్నప్పుడు ఓ ట్రైనర్ ఉప్పు వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని చెప్పాడని... అయినా తాను వాడుతూనే ఉన్నానని చెప్పారు. 1985లో ఒడిశాలో ఉన్నప్పుడు తాను వంట చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తన భార్యది ఒడిశా అని చెప్పారు.