Nallapureddy Prasanna Kumar Reddy: నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

YSRCP MLA Nallapureddy fires on officials
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లాలో నిత్యావసరాల పంపిణీ వివాదంలో నోటీసులు జారీ చేయడం పట్ల కోవూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్ విసిరారు.

 జిల్లా కలెక్టర్, ఎస్పీ తీరును ప్రశ్నిస్తూ, పేదలకు నిత్యావసరాలు అందిస్తే నాపైనా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులపైనా కేసులు నమోదు చేస్తారా? అంటూ మండిపడ్డారు. నియమనిబంధనలు తనకు కూడా తెలుసని, నిత్యావసరాల పంపిణీలో పాల్గొన్న ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా సహించబోనని హెచ్చరించారు. పోలీసులు, వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటే మీరు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పద్ధతి మార్చుకోవాలని నల్లపురెడ్డి హితవు పలికారు.
Go Back to Shorts
Nallapureddy Prasanna Kumar Reddy
Nellore District
District Collector
SP
Lockdown
Essentials

More Telugu News