భార్యకు కరోనా పాజిటివ్.. భర్త ఆత్మహత్య!

  • భార్యకు కరోనా అని తెలిసిన కాసేపటికే ఆత్మహత్య
  • ఘటనా స్థలంలో లభించని సూసైడ్ నోట్
  • మృతుడికి కూడా కరోనా ఉందా? అనేది తేలాల్సి ఉంది
భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన గురుగ్రామ్ లోని ఆచార్యపురిలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వయసు 54 ఏళ్లు. నిన్న రాత్రి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తన భార్యకు కరోనా సోకిందని తేలిన కొద్ది సేపటికే ఆయన సూసైడ్ చేసుకున్నాడని...  ఘటనాస్థలం వద్ద సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. మృతుడికి కూడా కరోనా సోకిందా? అనేది తేలాల్సి ఉందన్నారు. పోస్టుమార్టానికి ముందే ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని తెలిపారు.

Corona Virus
Husband
Suicide

More Telugu News