కరోనా అప్ డేట్స్: 10 వేల మార్కు దాటిన మహారాష్ట్ర... ముంబయిలోనే 7 వేల కేసులు!

  • మహారాష్ట్రలో కరోనా విజృంభణ
  • కొత్తగా 583 కేసులు
  • ఒక్కరోజే 27 మంది మృతి
దేశంలో కరోనా అత్యధిక ప్రభావం చూపుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పుడక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తాజాగా 583 కేసులు వెలుగు చూడడంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 10,490కి చేరింది. ఒక్క ముంబయిలోనే 7061 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మహారాష్ట్ర కరోనా మరణాల్లోనూ ముందుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ  459 మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ ఒక్కరోజే 27 మంది మరణించగా, వాటిలో 20 మరణాలు ముంబయిలోనే సంభవించాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య (733) కూడా పెరుగుతోంది.

Corona Virus
Maharashtra
Positive Cases
Deaths
COVID-19

More Telugu News