దేశంలో నేడు కొత్తగా 1,813 కేసులు.. 71 మంది మృతి

  • కరోనా కేసులకు అడ్డుపడని వైనం
  • 32 వేలకు చేరువలో కేసులు
  • వెయ్యి దాటిన మరణాలు
దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసులు మాత్రం రోజురోజుకు వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ రోజు మరో 1,813 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31,787కు పెరిగింది. 1,008 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 7,797 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 22,982 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

India
Corona Virus
COVID-19 deaths

More Telugu News