క్వారంటైన్లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం
- రాజస్థాన్ సవాయి మాధోపూర్ బటోడా పీఎస్ పరిధిలో దారుణ ఘటన
- సొంతూరుకు బయల్దేరిన మహిళను క్వారంటైన్ లో ఉంచిన స్థానికులు
- అదను చూసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
గురువారం రాత్రి ఆమె మాధోపూర్ కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.