ఇంటికే కోరినన్ని మామిడి పళ్లు... తెలంగాణ ఉద్యానవన శాఖ డోర్ డెలివరీ పథకం!
- 5 కిలోల కార్టన్ బాక్స్ రూ. 350
- మే ఒకటి నుంచి బుకింగ్స్
- 79977 24925 లేదా 79977 24944 నంబర్ల ద్వారా బుకింగ్
ఇందుకు తపాలా శాఖ పార్శిల్ సర్వీస్ సేవలను వినియోగించుకుంటున్నామని, 5 కిలోల బాక్స్ కు డెలివరీ చార్జీలను కలిపి రూ. 350 చెల్లించాలని, సుమారు 12 నుంచి 15 బంగినపల్లి కాయలు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలోపు 79977 24925 లేదా 79977 24944 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 4 నుంచి 5 రోజుల్లో డెలివరీ అందుతుందని, మే 1వ తేదీ నుంచి బుకింగ్స్ స్వీకరిస్తామని పేర్కొన్నారు.