భారత్ లో అంతకంతకు పెరుగుతున్న కేసులు... కొత్తగా 1,975 మందికి కరోనా నిర్ధారణ

More corona positive cases emerged in India
  • భారత్ లో 26,917కి చేరిన పాజిటివ్ కేసులు
  • కరోనాతో 826 మంది మృతి
  • 24 గంటల వ్యవధిలో 47 మంది మృత్యువాత
భారత్ లో కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1,975 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,917కి పెరిగింది. తాజాగా 47 మరణాలు సంభవించడంతో, ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 826కి చేరింది. వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నవారు 5,913 మంది కాగా, 20,177 మంది చికిత్స పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది.
Go Back to Shorts
India
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News