Telangana: తెలంగాణలో తగ్గుతున్న కరోనా!

New Corona Cases in Telangana Reduced
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదం అవుతున్నాయి. ఈ నెల 15 నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత నాలుగైదు రోజుల్లో నమోదైన కేసులను తీసుకుంటే, కరోనా కట్టడిలో ప్రభుత్వం విజయవంతం అవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు 13 కేసులు, శనివారం నాడు 7 కేసులు మాత్రమే తెలంగాణలో నమోదయ్యాయి. ఇదే సమయంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని సైతం అధికారులు పెంచారు. కరోనా వైద్య పరీక్షలు అధికంగా జరుగుతూ ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య కనిష్ఠానికి పడిపోవడం శుభ సంకేతమేనని అధికారులు అంటున్నారు.

మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో 1000కి దగ్గరైనా, మరో నాలుగైదు రోజుల్లో కొత్త కేసులు మరింతగా తగ్గుతాయని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓ దశలో రోజుకు 60 నుంచి 80 వరకూ కొత్త కేసులు నమోదైన రాష్ట్రంలో, ఇప్పుడు ఆ సంఖ్య 10కన్నా తక్కువకు చేరింది. ఇదే కొనసాగితే, త్వరలోనే లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు ఇచ్చి, ప్రజా జీవితాన్ని సాధారణ స్థాయికి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో కరోనా సోకి మొత్తం 658 చికిత్స పొందుతూ ఉండగా, వ్యాధి నుంచి కోలుకున్న 307 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 25 మంది మృత్యువాత పడ్డారన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Telangana
Corona Virus
Reduce
New Cases

More Telugu News