రెండేళ్ల క్రితం ఆపేసిన పాత ట్విట్టర్ ఖాతా 'పీకే క్రియేటివ్ వర్క్స్'లో పవన్ కల్యాణ్ ట్వీట్!

  • 2018 తరువాత ట్వీట్లు చేయని పవన్
  • 'జానీ' విడుదలై 17 సంవత్సరాలు
  • ట్వీట్ తో నాటి విశేషాలు పంచుకున్న పవన్
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఓ ఖాతా, సినిమాల గురించి మాట్లాడేందుకు మరో ఖాతా అంటూ, గతంలో చెప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆపై 'పీకే క్రియేటివ్ వర్క్స్' పేరిట ఉన్న ఖాతాను 2018లో పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' అప్ డేట్స్, 'ఖుషి', 'రంగస్థలం' గురించి తమ అభిప్రాయాలను చెప్పిన తరువాత, ఆ ట్విట్టర్ ఖాతాను పవన్ ఉపయోగించలేదు. రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఇప్పుడు 'వకీల్ సాబ్'తో మరోసారి ఫ్యాన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో, ఆ ఖాతాను తిరిగి తెరిచారు.

నాడు స్వయంగా నటించి, డైరెక్షన్ చేసిన 'జానీ' వచ్చి 17 సంవత్సరాలు అయిన సందర్భంగా సినిమా అనుభవాలను పవన్ పంచుకున్నారు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ట్వీట్ కు పవన్ రిప్లయ్ ఇచ్చారు. రిక్షా తొక్కుతున్న ఓ చిత్రాన్ని షేర్ చేసిన పవన్, అందులో ఉన్న తన దర్శకత్వ టీమ్ గురించి మాట్లాడారు. పవన్ తన సినిమాలను గురించి చెప్పేందుకు మరోసారి ట్విట్టర్ ను వాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Pawan Kalyan
PK Creative Works
Twitter
Tweet

More Telugu News