ధారావిలో ఒక్కసారిగా తగ్గిన కరోనా కేసులు!
- గురువారం 25 మందికి పాజిటివ్
- తర్వాత 24 గంటల్లో ఆరు కేసులే నమోదు
- మురికివాడలో ఇప్పటిదాకా 220 మందికి సోకిన వైరస్
సామాజిక దూరం పాటించడం కష్టమైన ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి అధికారులు స్క్రీనింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ చర్యలు ముమ్మరం చేశారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. అనేక కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిస్తోంది. దాదాపు లక్షన్నర మంది ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారందరికీ సరుకులు, మందులు నేరుగా ఇంటికే అందిస్తున్నారు. అలాగే, బీఎంసీ అధికారులు పలు చోట్ల ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా 50 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించి కొందరిని ఐసోలేషన్‌కు, కరోనా పరీక్షలకు సిఫారసు చేశారు.