హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా ప్రమాదకారి.. జాగ్రత్త!: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా ప్రమాదకారి.. జాగ్రత్త!: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్

Hydroxy Chloroquine is dangerous says FDA
  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో దుష్ప్రభావాలు వస్తాయి
  • గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం
  • అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకే అనుమతిచ్చాం
కరోనా వైరస్ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధానికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుందనే అంచనాలతో దీనికి డిమాండ్ ఏర్పడింది. అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రమాదకారి అని... దీని వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే వీటిని పొందుపరిచారని చెప్పింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుడి పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలనే విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బంది జాగ్రత్తగా నిర్ణయించాలని తెలిపింది.

కరోనాపై సమర్థవంతంగా పోరాడే ఔషధాల కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని ఎఫ్డీఏ చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపింది. ఈ డ్రగ్ వాడకానికి సంబంధించి పూర్తి వివరాలను వైద్యులకు అందుబాటులో ఉంచాలని సూచించింది.

మరోవైపు, ఈ ఔషధ నిల్వలు భారత్ వద్ద ఎక్కువగా ఉండటంతో... ఎన్నో దేశాలు వీటిని సరఫరా చేయాల్సిందిగా మన దేశాన్ని కోరాయి. సాయం కోరిన అన్ని దేశాలకు భారత్ ఈ డ్రగ్ ను సరఫరా చేసింది. తద్వారా ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించింది.
Hydroxychloroquine
FDA
Corona Virus

More Telugu News