పోలీసులు, వైద్యులకు సహకరిద్దాం: హైపర్ ఆది
- వాళ్లు మనకోసం చాలా కష్టపడుతున్నారు
- ఇంట్లోనే ఉండి మన కుటుంబాలను, దేశాన్ని కాపాడుకుందాం
- ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్లో వీడియో సందేశం
కరోనాకి సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 నంబర్ కు వాట్సప్ చేయాలని సూచించాడు. ఈ మేరకు ఆది వీడియో సందేశాన్ని ఆరోగ్య ఆంధ్ర తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ‘బయట కాలు పెట్టకుండా ఇంట్లోనే ఉండడం ఇబ్బందిగా ఉన్న పర్లేదు. మనం బయట కాలు పెడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లోనే ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే, మన ఫ్యామిలీని, దేశాన్ని కాపాడుకుందాం’ అని సూచించాడు.