శంకర్ పట్ల 'భారతీయుడు 2' నిర్మాతల అసహనం?
- ఆది నుంచి 'భారతీయుడు 2'కి ఆటంకాలు
- ముఖ్యమైన పాత్రలో బాబీ సింహా
- కథానాయికగా కాజల్
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను శంకర్ .. బాబీసింహాను తీసుకున్నాడు. కాల్షీట్స్ ప్రకారం పనిచేసే బాబీ సింహాకి ఇంతవరకూ 6 కోట్లు ముట్టజెప్పారట. ఆయనపై చిత్రీకరించవలసిన సన్నివేశాలకిగాను మరో 4 కోట్లను చెల్లించవలసి వుంటుందట. అయితే బాబీ సింహాను తీసుకుని శంకర్ బడ్జెట్ పెంచేశాడనే అభిప్రాయంతో వున్న నిర్మాతలు, ఆయన పట్ల అసహనంతో ఉన్నారని అంటున్నారు. బాబీసింహాతో మాట్లాడి ఇవ్వవలసిన ఎమౌంట్ తగ్గేలా చూడమని చెప్పారని సమాచారం. మరి ఈ విషయంలో బాబీసింహాను శంకర్ ఎలా రిక్వెస్ట్ చేస్తాడో చూడాలి మరి.