వాళ్లు పూలు చల్లుతారని నాకు తెలియదు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- పుత్తూరులో మంచినీటి బోర్ ప్రారంభోత్సవం 3 రోజుల కిందట జరిగింది
- ఆరోజున ప్రారంభోత్సవానికి నేను రానని చెప్పాను
- ప్రజల బలవంతంతో వెళ్లాల్సి వచ్చింది
పచ్చ ఛానెళ్లలో తనపై డిస్కషన్ కూడా పెట్టారని, ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తనపై విమర్శలు చేశారని అన్నారు. టీడీపీ పాలనలో పుత్తూరును ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ రోజున ప్రారంభోత్సవానికి తాను రానని, అక్కడి ప్రజలనే ప్రారంభించాలని చెప్పినా వాళ్లు వినలేదని చెప్పారు. అక్కడికి నడిచి వెళుతుండగా వాళ్లు పూలు చల్లారని, ఆ విషయం తనకు గానీ, పోలీసులకు గాని తెలియదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి 35 రోజులుగా ఎంతో శ్రమిస్తున్నానని, ఈ మంచి విషయాలను చూపించని పచ్చ ఛానెళ్లు, ఈ రోజున పనిగట్టుకుని పూలుజల్లే వీడియోను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.