కరోనా నుంచి బయటపడిన వారంతా ప్లాస్మా డొనేట్ చేయండి: తబ్లిగీ జమాత్ చీఫ్
- ప్లాస్మా డొనేట్ చేసి ఇతరులకు సహాయపడండి
- క్వారంటైన్ లో ఉన్నవారిలో అధికులకు ఇన్ఫెక్షన్ లేదు
- రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలి
కరోనా నుంచి బయటపడిన వారికి తాను ఒక విన్నపం చేస్తున్నానని... వారంతా తమ బ్లడ్ ప్లాస్మాను ఇతరులకు డొనేట్ చేయాలని ఖందాల్వీ కోరారు. కరోనాతో పోరాడుతూ, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి సహాయపడాలని విన్నవించారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఖందాల్వీ పిలుపునిచ్చారు.