కేంద్ర బృందాల పర్యటనను 'సాహసోపేత యాత్రలు'గా అభివర్ణించిన టీఎంసీ... మమత సహకరించడం లేదన్న కేంద్రం
- రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల అంచనాకు కేంద్ర బృందాల రాక
- సీఎంకు ఆలస్యంగా సమాచారం అందించారంటూ టీఎంసీ ఎంపీల రుసరుస
- బెంగాల్ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర బృందం ఆరోపణ
కాగా, కేంద్ర బృందాల్లో ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన తమకు స్థానిక ప్రభుత్వం విస్తృత సహకారం అందించడంలేదని ఆరోపించారు. తమ బృందంలోని సభ్యులను బయటికి అనుమతించేది లేదన్న సమాధానం స్థానిక అధికారుల నుంచి వినవచ్చిందని తెలిపారు.