'జేమ్స్ బాండ్' తరహాలో మహేశ్ ను చూపించనున్న రాజమౌళి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జేమ్స్ బాండ్' తరహాలో మహేశ్ ను చూపించనున్న రాజమౌళి!

Rajamouli Movie
  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • తదుపరి సినిమా మహేశ్ బాబుతో
  • స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనేది అభిమానుల్లో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో వుంటుందనే విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. దాంతో ఆయన మహేశ్ బాబును ఎలా చూపించనున్నారనేది చర్చనీయాంశమైంది.

గతంలో రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ, 'జేమ్స్ బాండ్' తరహా పాత్రలకు మహేశ్ బాబు కరెక్టుగా సెట్ అవుతాడని అన్నారు. అందువలన ఆయన మహేశ్ ను 'జేమ్స్ బాండ్' తరహా పాత్రలో చాలా స్టైలీష్ గా చూపించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారట. అందువలన 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
Rajamouli
Mahesh Babu
Vijayendra Prasad

More Telugu News