ప్రింట్ మీడియాకు ఊరటనిస్తూనే కీలక నిర్ణయం తీసుకున్న ‘మహా’ ప్రభుత్వం
- ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్డౌన్ నుంచి మినహాయింపు
- దినపత్రికలను ఇంటింటికీ వెళ్లి పంచకూడదన్న ప్రభుత్వం
- పది శాతం మందితో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశం
ఈ నెల 20 నుంచి హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో అనుమతించే కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరోగ్యం, వ్యవసాయం తదితరాలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అమలు చేయాల్సిన సడలింపులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా మహా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.